ఎల్లారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం నుండి పునః ప్రారంభించిన సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు బాంధవుడు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా కెసిఆర్ రూ.19 వేల కోట్లతో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రుణమాఫీ, సాగు నీరు, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలతో తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చిన కెసిఆర్‌కి రైతులతో కలిసి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మునిసిపల్ ఛైర్మన్, కౌన్సిలర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఏ.ఎం.సి చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు, భారాస పట్టణ, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.