బాన్సువాడ, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా మెగా ఏజెన్సీ కార్యలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద విధులు నిర్వహిస్తున్న కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారని, కార్మికులకు రావలసిన హక్కులను కాపాడాలని వారన్నారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఖలీల్ డివిజన్ అధ్యక్షుడు రూప్ సింగ్, కార్యదర్శి, పండరి, బాలరాజ్, మోగులయ్యా, సోమేష్, భాస్కర్, పీర్య, అహ్మద్, శ్రీకాంత్, ఆయుబ్, రవి, రాజు, అనిల్, జనార్ధన్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.