బాన్సువాడ, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ సమగ్ర శిశు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అందించాలని కోరుతూ శుక్రవారం ఆర్డీవో, తహాసిల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను వెల్లదిస్తున్నామని, ప్రభుత్వం విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాన్ని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్డిఓ బోజరావ్ సానుకూలంగా స్పందిస్తూ జిల్లా ఉన్నతాధికారికి సమాచారాన్ని చేరవేస్తానని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వసంత్, జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.