కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ జన్మదిన పురస్కరించుకొని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో గురువారం 67వ సారి రక్తదానం చేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 78 మంది రక్తదాతలతో కలిసి ఏర్పాటు చేయడం జరిగిందని నేడు 2653 మంది రక్తదాతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
కరోనా సమయంలో కూడా 100 యూనిట్ల ప్లాస్మాను,తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావాల్సిన రక్తాన్ని,డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్లేట్ లెట్స్ ను,వివిధ ఆపరేషన్ల నిమిత్తమై కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేస్తూ వేలాదిమంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సభ్యులు ఏర్రం చంద్రశేఖర్, కిరణ్, రమణ, కుంభాల లక్ష్మణ యాదవ్, అనిల్, అశోక్ రెడ్డి, టెక్నీషియన్లు జీవన్, వెంకట్ పాల్గొన్నారు.