ఆర్మూర్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఉదయం ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మరియు గోవింద్ పేట్ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఈతమొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, డిస్టిక్ ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి వివరించారు.
కార్యక్రమంలో ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏ.గంగాధర్, ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి సర్పంచ్ జమున గంగాధర్, గౌడ సంఘం అధ్యక్షులు గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ రాజ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మైపాల్, విడిసి చైర్మన్ లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుకన్య రెడ్డి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు యాదగౌడ్, రామ గౌడ్, అంజాగౌడ్ శేఖర్ గౌడ్ మరియు ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయం హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.