కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయని, శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో చేనేత జౌళి శాఖా, డిఆర్ డిఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
నేటి తరానికి అనుగుణంగా చేనేత కార్మికులు సరికొత్త ఆలోచనలతో వివిధ రకాలలో నైపుణ్యత గల వస్త్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు చేనేత వస్త్రాలు ధరించి వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి తమవంతు సహాకారమందించాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్ డిఓ సాయన్న, డిపి ఏం లు రమేష్ బాబు, రవీందర్, అధికారులు పాల్గొన్నారు.