ఆర్మూర్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామములో నాయకపోడ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్ ఇందుర్ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు.
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజస మితి ప్రకటించిందని అయన తెలిపారు.
కార్యక్రమంలో ఎంపిటిసి బాల నర్సయ్య, మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి జన్నెపల్లి, మాజీ సర్పంచ్ కుస్థాపురం గంగ రెడ్డి, విడిసి అధ్యక్షులు రిక్కల గంగారెడ్డి, జిల్లా నాయకపోడు ఉద్యోగస్థుల కోశాధికారి రవి, సారంగి శాంతి కుమార్, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.