విడిసి ఆగడాలు హద్ధులు మీరుతున్నాయి

ఆర్మూర్‌, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయడంతో అవస్థలకు గురవుతున్నారు. బాధిత కులసంఘాల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోమన్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్‌ గ్రామానికి చెందిన ఎమ్‌ఎన్‌ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది, కాగా కెనాల్‌ పక్కనుండి మరో 30 గుంటల స్థలం కూడా అతనికి సంబంధించినదే.

20 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసిన భూమిని సదురు వ్యక్తి ఇటీవల 30 గుంటల స్థలానికి రెవెన్యూ సర్వే చేపట్టి పంచనామా చేస్తే సంబంధిత భూమికి పంచులుగా కోమన్‌పల్లి గ్రామానికి చెందిన గుజ్జ అశోక్‌ యాదవ్‌, నిమ్మ పోషెట్టీ (నాయక పొడు) సంతకాలను పెట్టారు. వీరిద్దరే కాకుండా సుబ్బిర్యాల్‌ గ్రామస్తులు ఎనిమిది మంది కూడా పంచులుగా సంతకాలు పెట్టారు. కోమన్‌పల్లి గ్రామస్తులు ఇద్దరు సంతకాలు పెట్టడం వల్లే 30 గుంటల స్థలం గంగారెడ్డికి దక్కిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇరువురిపై ఆరోపణలు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

రెండు రోజుల పాటు సమయం కావాలని బాధితులు అడిగిన అవేమీ పట్టించుకోకుండా లక్ష ఆరువేల రూపాయలు ఖర్చయిందని చెప్పి డబ్బులు ఇరువురు చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఆర్మూర్‌ తాసిల్దార్‌, ఆర్‌ఐ, ఏడి అధికారులు చెప్పారని, పంచులుగా సంతకం పెట్టినందుకే జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. జరిమానాగా విధించిన డబ్బులు చెల్లించాలని విడిసి డిమాండ్‌ చేశారు.

ఈ నెల 7వ తేదీన సంబంధిత విషయమై ఆర్మూర్‌ సీఐ సురేష్‌ బాబుకు ఫిర్యాదు చేయగా 8వ తేదీన సీఐ వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపించి వెళ్లారు. గ్రామ విడీసీని కాదని పోలీసులను ఎందుకు పిలిపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే రోజు నుండి గొల్ల కురుమ 28 కుటుంబాలు, నాయకపోడు 22 కుటుంబాలను సాంఘిక కుల బహిష్కరణ చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు కుల సంఘాల కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురి చేస్తూ నిత్యవసర సరుకులు, హోటల్లో టీ టిఫిన్‌, ఫిల్టర్‌ వాటర్‌, డిష్‌ టీవీ కనెక్షన్‌, ఆర్‌ఎంపి వైద్యుడి సేవలు, బీడీ కార్మికులకు ఆకులు, బీడీలను తీసుకోవడం లేదని కన్నీటి పరమంతామయ్యారు. చివరకు బర్రెలు, గొర్రెలను కూడా మందలో కలువనియడం లేదని చెప్పారు. రెండు కుల సంఘాల కుటుంబాలను దుర్భషలాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సర్వేకి పంచులుగా ఉండి సంతకాలు పెట్టడమే మా తప్ప అంటూ ప్రశ్నించారు. రెండు కుల సంఘాల సమస్యను పరిష్కరించి సంబంధిత అధికారులు, పోలీసులు సరైన న్యాయం చేయాలని వారు తెలిపారు.

Check Also

ప్రపంచ కప్‌ స్కేటింగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి శాంతాపూర్‌ క్రీడాకారిణి

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »