బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు

బాన్సువాడ, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, ఆర్‌డివో భుజంగరావు, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ… ఇదో గొప్ప కార్యక్రమమని, ఇలాంటి పథకం దేశంలోనే మొదటిసారి అన్నారు. బలహీన వర్గాలకు దేశంలో 100 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్‌ అని, కుల వృత్తులను ప్రోత్సహించడానికి ఈ బిసి బందు అన్నారు. గత ప్రభుత్వాల హయంలో ఎవరైనా లబ్ధిదారులు స్వంతంగా వ్యాపారం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే 20 శాతం సబ్సిడీ మంజూరు కావడానికి చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, పైరవీలకే సగం డబ్బులు ఖర్చు అయ్యేవని గుర్తుచేశారు.

మిగతా 80 శాతం వాటా కోసం బ్యాంకుల చుట్టూ సంవత్సరాలు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని సంతోషం వ్యక్తం చేశారు. చెక్‌ తీసుకుని వెళ్ళి బ్యాంకు నుండి నగదు తీసుకుని మీ కుల వృత్తి వ్యాపారం చేసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల ప్రజలకు ఇస్తున్న లక్ష రూపాయల పథకం మొత్తం సబ్సిడీనే అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఇస్తున్నామని, బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, నస్రుల్లాబాద్‌, బీర్కూరు మండలాల పరిధిలో 2000 మంది అర్హులైన వారు ఉన్నారన్నారు. విడతల వారిగా ప్రతినెలా కొంతమందికి అందుతాయి. ఇదో నిరంతరం కార్యక్రమం అని, ఎవ్వరూ నిరాశ పడనక్కర్లేదని, అందరికీ ఈ పథకం అందుతుందన్నారు.

నగదు సహాయాన్ని వృదా చేయవద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ, సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు, మీ కుటుంబం ఆర్ధికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »