కామారెడ్డి, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో భిక్కనూరు మండలం లక్ష్మీదేవినిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి తన కుమార్తె అద్వైత జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ నెగిటివ్ రక్తాన్ని శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ నిస్వార్థ సేవకులు రక్తదాతలేనని, సమాజంలో స్వార్థం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందజేస్తూ సమాజ హితాన్ని కోరుకునే వాళ్లే రక్తదాతలు అని అన్నారు. గతంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందించడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచిన రక్తదాత బద్దం నిశాంత్ రెడ్డికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు జీవన్, వెంకట్ పాల్గొన్నారు.