నిజామాబాద్, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్ అన్నారు.
ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్ చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి యువతకు మార్గదర్శకులుగ కొయ్యాడ శంకర్ నిలబడ్డారని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. కొయ్యాడ శంకర్ తను నిబద్దతతో ఎన్నో బీసీ సభలను విజయవంతం చేసారని బీసీ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు.
తనను నమ్మి ఇన్ని రోజులు బాధ్యతలు అప్పగించిన వారందరికి కొయ్యాడ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు తెలిపిన నూతన అధ్యక్షులు విజయ్. కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, కొయ్యాడ శంకర్, ధర్శనం దేవేందర్, లక్ష్మీనారాయణ రాజు, కోడూరు స్వామి, వెంకటేశ్, సదానంద్, బగ్గలి అజయ్, పోశెట్టి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.