కామారెడ్డి, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సిద్దు (13) బాలుడికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో సకాలంలో అందజేశారని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని రక్తదానం చేయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తయని,రక్తదానం చేసే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చేసిన సర్వే ద్వారా తెలియడం జరిగిందన్నారు. రక్తదానం చేసిన కిరణ్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు కిరణ్, పుట్ల అనిల్, భాగయ్య టెక్నీషియన్లు జీవన్, వెంకటేశ్ పాల్గొన్నారు.