మంత్రి కెటిఆర్‌ ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు…

కామారెడ్డి, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఐ.టి. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామా రావు సోమవారం కామారెడ్డి, యెల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ముందుగా నర్సన్‌పల్లి బైపాస్‌ వద్ద 61 లక్షల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి ప్రవేశ ద్వారం ఆర్చ్‌ను ప్రారంభించారు.

జాతీయ రహదారి 44 నుండి ఈ.ఎస్‌.ఆర్‌. గార్డెన్‌ వరకు కోటి 20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ ను, 2 కోట్ల 80 లక్షలతో నిర్మించిన మీడియన్‌ ను ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ రహదారి 44 నుండి మారుతీ సుజుకి షో రూమ్‌ వరకు 7 కోట్ల వ్యయంతో 4 వరుసల నుండి 6 వరుసలుగా విస్తరించిన బి.టి. రహదారిని, కోటి 60 లక్షలతో మారుతీ సుజుకి షో రూమ్‌ నుండి ఈ.ఎస్‌.ఆర్‌. గార్డెన్‌ వరకు విస్తరించిన రహాదారిని ప్రారంభించారు. మునిసిపల్‌ కార్యాలయం నుండి ఈ.ఎస్‌.ఆర్‌. గార్డెన్‌ వరకు కోటి మూడు లక్షల వ్యయంతో నిర్మించిన మీడియన్‌ ను, 80 లక్షల వ్యయంతో టేక్రియాల్‌ బైపాస్‌ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్మించిన సెంట్రల్‌ మీడియన్‌ ను ప్రారంభించారు.

అదేవిధంగా టేక్రియాల్‌ బైపాస్‌ నుండి ఈ.ఎస్‌.ఆర్‌. గార్డెన్‌ వరకు 10 కోట్ల 20 లక్షల వ్యయంతో 4 వరుసల నుండి 6 వరుసలు విస్తరించిన బి.టి. రోడ్‌ ను, టేక్రియాల్‌ బైపాస్‌ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్‌ వరకు కోటి 42 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్‌ మీడియన్‌ ను, డిగ్రీ కాలేజీ నుండి ఈ.ఎస్‌.ఆర్‌ గార్డెన్‌ వరకు కోటి 22 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్‌ లైటింగ్‌ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలో రెండు కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్పోర్ట్స్‌ స్టేడియంకు శంఖు స్థాపన చేశారు.

ఆ తరువాత యెల్లారెడ్డి మున్సిపాలిటీలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హై లెవెల్‌ బ్రిడ్జిలను , 3 కోట్ల 30 లక్షల ఖర్చుతో నిర్మించిన రోడ్డు పునరుద్ధరణ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి, 10 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న సి.సి. రోడ్లు, మురుగుకాలువలు, బి.టి. రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అలాగే 2 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న వెజ్‌, నాన్‌-వెజ్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి, 4 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న మునిసిపల్‌ భవన నిర్మాణానికి మంత్రి శంఖు స్థాపన చేశారు. 80 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్‌ పార్క్‌ ను మంత్రి ప్రారంభించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »