డిచ్‌పల్లి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిస్టర్ ఫ్లయింగ్ ఆఫీసర్ దేశ్పాండే విష్ణు చైతన్య పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకున్నారు.
విద్యార్థులు కష్టపడి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. దేశం కోసం పనిచేస్తామనే ఉద్దేశం ఉన్నవారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు కష్టపడితే అత్యున్నత స్థానానికి చేరుకొని దేశానికి సేవలు అందించగలరని అన్నారు.
విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడే తత్వం సమయపాలన వంటివి కీలక పాత్ర పోషిస్తాయని క్రమశిక్షణతో కష్టపడితే అత్యున్నత స్థానాన్ని సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేగలుగుతారని కష్టపడి చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కైసర్ మొహమ్మద్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ, శ్రీకాంత్, ప్రొఫెసర్ నందిని, ప్రొఫెసర్ నీలిమ, విద్యార్థులు పాల్గొన్నారు.