కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భవాని (25) గర్భిణీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు రక్తనిధి కేంద్రాలకు వెళ్లినప్పటికీ వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు 13వ సారి మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని ఎల్లవేళలా అందజేయడం జరుగుతుందని మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గంతోనే లభిస్తుందని అన్నారు. రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాలను కాపాడమే అని రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 కి సంప్రదించాలని అన్నారు.
రక్తదాత రాజుకు ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్, పుట్ట చందు, శ్రీనివాస్ పాల్గొన్నారు.