ఆర్మూర్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం అధ్యక్షుడు మీనుగు చిన్న రాజేందర్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సంఘ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప సర్పంచ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రిక్కల రాజు, మాజీ ఎంపిటిసి సభ్యులు జన్నపళ్లి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ సారంగి శాంతి కుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయలు మాధవ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.