నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆవిష్కరణలను మరియు సృజనాత్మకత సంస్కృతీ పెంపొందించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటిఈ అండ్ సి శాఖ, తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలో ఇంటింటా ఇన్నోవెటర్ 5 విడత కార్యక్రమాన్ని విజయవంతంగ నిర్వహించారు. ఇందులో భాగంగ స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్టు 2023 రోజున ఎంపిక చేసిన ఆవిష్కరణలతో ప్రదర్శన చేసారు.
రాష్ట్రమంతా నూతన ఆవిష్కరణలను చేసే ఆవిష్కర్తలను గుర్తిస్తూ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవాటర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక వృత్తుల నుండి ఎంతో మంది రెండు నెలల వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 266 ఆవిష్కరణలు వచ్చాయని తెలిపారు. వాటి నుండి 63 ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినవారి లో పురుషులు – 51, స్త్రీలు – 12, సంఖ్యలో ఉన్నారు. ఇంటింటా ఇన్నోవెటర్ ద్వారా ఎన్నో తక్కువ ఖర్చు తో చేయబడిన అవిష్కరణలు వెలుగులోకి వచ్చాయన్నారు.
టిఎస్‌ఐసి బృందం 33 జిల్లాలో ఈడిస్ట్రిక్ట్ మేనేజర్స్ (ఆడిఎంఎస్) సహకారంతో ఆవిష్కర్తలను వెలికితీసే కార్యక్రమం నిర్వహించారు. టిఎస్‌ఐసి బృందం ఇలాగే జిల్లా కలెక్టర్లకు మరియు మిగితా ప్రభుత్వ ఉద్యోగులకి ఆవిష్కరణల మీద అవగాహనా సదస్సులు నిర్వహించారు. కార్యక్రమాన్నికి సంబందించిన పోస్టర్‌ని 6 జూన్ 2023 న కెటిఆర్, మినిస్టర్ ఐటి ఈ అండ్ సి, తెలంగాణ ప్రభుత్వం, జయేష్ రంజాన్, ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఐటి ఈ అండ్ సి, తెలంగాణ ప్రభుత్వం మరియు డా. శాంతా తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అఫ్ తెలంగాణ విడుదల చేశారు.
దరఖాస్తు పద్దతిని సులభతరం చేస్తూ 9100678543 వాట్సాప్ నెంబర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అప్లై చేసుకున్నవారిలో రైతులు, మెకానికులు, గృహిణులు, విద్యార్థులు మరియు ఇతర వృత్తుల వారు ఉన్నారు.