రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

కామరెడ్డి, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని వెన్నెముక రైతు అని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమాతో పాటు 24 గంటల ఉచిత్‌ విద్యుత్‌, సాగు జలాలు అందించి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసి ఆదుకుంటుందని తెలిపారు.

తద్వారా నాడు కోటి ఎకరాలు సాగవుతుండు గా నేడు 2 కోట్ల 18 లక్షల ఎకరాలు సాగవుతున్నదని, 37 లక్షల టన్నుల నుండి 2 కోట్ల 30 లక్షల టన్నుల పంట దిగుబడి సాధిస్తూ దేశానికే తలమానికంగా మన రాష్ట్రం నిలుస్తుందని అన్నారు. రైతు బంధు క్రింద జిల్లాలో 11 విడతలలో 2,96,452 మంది రైతులకు 2,501 కోట్ల రూపాయలు అందించామని, రైతు భీమా క్రింద 5,895 మంది నామినీలకు 295 కోట్లు అందించామన్నారు. 8,100 ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ సాగు లక్ష్యంగా చేసుకొని 484 ఎకరాలలో సాగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 642 చెరువులలో 2 కోట్ల 70 లక్షల చేప,రొయ్య పిల్లలను వదిలామన్నారు.

గొల్ల , కురుమలను ఆదుకునేందుకు రెండో విడతలో 6,384 యూనిట్లకు గాను ఇప్పటి వరకు 2,890 యూనిట్లు గ్రౌండ్‌ చేశామని శాసనసభా పతి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్ట్‌, కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌ లు నిండాయని, ఆ ప్రాజెక్ట్ల క్రింద ఉన్న ఆయకట్టుకు నీరందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 1,69,231 మంది లబ్దిదారులకు ప్రతి నెల 35 కోట్ల 99 లక్షలు అందిస్తున్నామన్నారు. దళిత బందు క్రింద నియోజక వర్గంలో 1100 చొప్పున యూనిట్లకు ఆర్ధిక సహాయం అందించనున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ క్రింద ఇప్పటి వరకు 43,132 మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించామన్నారు.

698 మంది మైనారిటీలకు త్వరలో లక్ష రూపాయల చొప్పున 6 కోట్ల 98 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించనున్నామన్నారు. బిసి కుల,చేతి వృత్తుల వారికీ నియోజక వర్గంలో 300 మంది చొప్పున ప్రతినెలా అందించనున్నామన్నారు. 5 వేల మంది గిరిజనులకు 11,365 ఎకరాలకు సంబంధించి పట్టాలు పంపిణి చేశామని, వారు రైతుబంధు పొందుదుతున్నారని అన్నారు. జిల్లాకు మెడికల్‌ కళాశాల,బాన్సువాడలో నర్సింగ్‌ కళాశాల మంజూరు వల్ల వైద్య విద్య మరింత అంద్దుబాటులోకి వచ్చిందని అన్నారు. చిన్నారులకు తల్లిపాలు, ముర్రుపాలు పట్టించడంలో దేశంలో బాన్సువాడ మాత శిశు ఆసుపత్రి నాల్గవ స్థానంలో నిలిచిందని, పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తప్పనిసరిగా ముర్రుపాలు పట్టాలని అన్నారు.

పల్లె దవాఖానాలు ఏర్పాటు ద్వారా నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం 9 వేల స్వయం సహాయక సంఘాలకు రూ. 629 కోట్ల బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి క్రింద 9,614 మంది సభ్యులకు రూ.72 కోట్ల 56 లక్షలు అందించామన్నారు. రోడ్ల మహర్దశకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పొలీసు శాఖ రాష్ట్రంలో ముందంజలో ఉందని అన్నారు. అనంతరం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.

విశిష్ట సేవలు చేసిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్సి కార్పొరేషన్‌ దళిత బందు పధకంపై ఏర్పాటు చేసిన శకటం ప్రదర్శన ఆకట్టుకుంది . వివిధ పాఠశాల విద్యార్థినీలు, విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్‌ ను శాసనసభాపతి పరిశీలించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ, శాసనసభ్యులు జాజల సురేందర్‌, హనుమంతు షిండే, రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్‌ ముజీబుద్దీన్‌, అదనపు కలెక్టర్లు మను చౌదరి,చంద్రమోహన్‌, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర రావు, జెడ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందు ప్రియ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »