కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబరచిన వ్యక్తులకు,సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డును అందిస్తున్నదని అన్నారు.
అవార్డుకు ఎంపికైన వ్యక్తులకు,సంస్థలకు మూడు నగదు బహుమతులు అందజేస్తుందని ఆయన తెలిపారు. 2024 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డుకు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు అవార్డ్స్.జివోవి.ఇన్ వెబ్సైట్ నందు ఆన్లైన్లో ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ పాటిల్ సూచించారు.