కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ఎస్సి విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించుటకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలోని విశ్వ విద్యాలయంలో చదవాలనుకునే విద్యార్థులు ఆర్ధిక సహాయానికై సెప్టెంబర్ 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అయితే అభ్యర్థి పాస్ పోర్ట్, వీసా కలిగి, జిఆర్‌ఇ / జిఎంఏటి లేదా టోఫెల్ / ఐలెట్స్‌లో అర్హతతో పాటు డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలన్నారు. అదేవిధంగా అక్రిడిటేషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ, సంస్థ నుండి అడ్మిషన్ లెటర్ పొంది ఉండాలని సూచించారు. కుటుంబ వార్షికాదాయం 2 లక్షలు మించి ఉండరాదని, కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కాలర్‌షిప్ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వివరాలకు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనుటకు తెలంగాణ ఈ పాస్ వెబ్ సైట్ ను సందర్శించవలసినదిగా రజిత సూచించారు.