ఆర్మూర్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బస్వా గార్డెన్లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ పార్దేమ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్‌లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.
అలాగే తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు సత్ పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగమోహన్, కోశాధికారి లిక్కి శ్రవణ్ కుమార్, సలహాదారుడు గణేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, చింతల విన్సెంట్, మహిపాల్, దినేష్, మహేష్, ముకేష్, శ్రవణ్, అరుణ్ కుమార్, షికారి శ్రీనివాస్, భారడ్ గణేష్, అయ్యాడి సురేష్, రాజేందర్, రాంపూర్ శ్రవణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.