Daily Archives: August 18, 2023

లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …

Read More »

తెలంగాణ తొలి బహుజన వీరుడు పాపన్న

బీబీపేట్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో తోలి బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 373 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ వరంగల్‌ జిల్లా …

Read More »

సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరీలో జాప్యానికి తావులేకుండా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని హితవు పలికారు. ఆసరా పెన్షన్లు, తెలంగాణకు హరితహారం, …

Read More »

బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లింగ గౌడ్‌, స్థానిక కౌన్సిలర్‌ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్‌ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్‌ అంతర్జాతీయ …

Read More »

పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత …

Read More »

జిల్లా అభివృద్ధిపై సమీక్ష…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల గురించి సభలో పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా ప్రజా పరిషద్‌ చైర్‌ పర్సన్‌ ధఫెదార్‌ శోభ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో జెడ్పి చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలుసునని, సభలో వారు …

Read More »

దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం 9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట పటిమ ఆందరికీ స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ …

Read More »

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటి పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ …

Read More »

నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లెల వికాసం

మోర్తాడ్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్‌ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »