మోర్తాడ్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన మార్పులతో తెలంగాణ పల్లెలు సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీలను వికేంద్రీకరిస్తూ జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తూ తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలన్నీ వికాసాన్ని సంతరించుకొని యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు.
ప్రతి పల్లెలో పచ్చదనం పెరిగి, ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. గడిచిన యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధి, నూతన పంచాయతీరాజ్ చట్టంతో అతి స్వల్ప కాలంలోనే సాధ్యపడిరదని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు వరించిన అవార్డులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. సమగ్ర ప్రగతి, సదుపాయాల కల్పన కొలమానంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వరించాయని వివరించారు.
వీటిలో నిజామాబాద్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు, బాల్కొండ నియోజకవర్గంలోని ఒక గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ జీపీగా గుర్తింపు లభించడం జరిగిందన్నారు. ఈ విషయమై నీతి ఆయోగ్ లో సైతం చర్చ జరిగిందన్నారు. తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతోనే పల్లెలు ప్రగతి దిశగా పయనిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని స్వయంగా నీతి ఆయోగ్ వెల్లడిరచడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు తార్కాణం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల కృషి, పట్టుదలతోనే పల్లెల వికాసం సాధ్యపడిరదని, ఈ దిశగా స్ధానిక ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో తోడ్పాటును అందించారని అభినందించారు.
ప్రస్తుతం నాలుగేళ్ళ సర్వీస్ ను పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమించిన నేపథ్యంలో పల్లెల అభ్యున్నతి కోసం మరింత అంకిత భావంతో పని చేయాలని సూచించారు. నిస్వార్థంతో, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తే, మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
కాగా, మోర్తాడ్ మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.