కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. గన్ని బ్యాగులు, మైసర్ మిషన్లు, తూకం యంత్రాలు, తాటిపత్రులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 350 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధం కావాలని కోరారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా సహకార అధికారిని వసంత, ఐకెపిడిపీఎం రమేష్ బాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.