ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో హరిపూర్‌లో బారాస సంబరాలు

ఆర్మూర్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గానికి జీవన్‌ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆర్మూర్‌ మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన పల్లె (హరిపూర్‌) గ్రామములో సోమవారం విడిసి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ అభివృద్ధి రాష్ట్రంగా రూపు దిద్దుకుందని గ్రామస్టులు అన్నారు. కెసిఆర్‌ను బలపర్చచడానికి వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా జీవన్‌ రెడ్డిని 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి, ఆర్మూర్‌ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని విడిసి అధ్యక్షులు కార్యదర్శులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు సాయిలు, కోశాధికారి అది శ్రీను, విడిసి సభ్యులు ఎల్క దేవరాజ్‌, గ్రామ పెద్దలు కాశీరం గౌడ్‌, బిఆర్‌ఎస్‌ నాయకుడు నితిన్‌ రాజ్‌, టియుడబ్ల్యుజె, ఐజెయు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్‌ పార్దేమ్‌, మంగలి శ్రవణ్‌, టి సత్తయ్య, సుంకపక రాజేశ్వర్‌, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »