నిజామాబాద్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది.
ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వర్షం పడితే చాలు నడవలేని పరిస్థితి ఉంది. వారాల తరబడి బురదమయంగా మారుతుంది. అమ్మనగర్‌లోకి చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళుతుంటారు, కానీ రోడ్డు అధ్వాన్నంగా మారడంతో వేరే మార్గం గుండా వెళుతున్నారు. ఇదిలా ఉండగా హెచ్‌పిఎస్ స్కూల్‌కు విద్యార్థులను తీసుకు వెళ్లే వాహనాలు ఈ రోడ్డు గుండా వచ్చేది బురదగా ఉండడంతో ఒకేరోడ్డులో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం వేళ, పాఠశాల సమయంలో ఇబ్బందిగా మారుతుంది.
ఏదేమైనా ఈ రోడ్డును బాగుచేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని, తక్షణమే బాగుచేయించి తమ అవస్థలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.