డిచ్‌పల్లి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల లా ఫైనల్ ఇయర్ విద్యార్థులకి మూట్ కోర్ట్ పరీక్షలు సోమవారం 21 నుండి 25 వరకు జరుగనున్నాయి. ముట్కోర్టు పరీక్షలో భాగంగా విద్యార్థులకు మూడు అంశాలలో సమస్యలు ఇచ్చారు. మొదటిది సివిల్ లా రెండవది క్రిమినల్ లా మూడవది కాన్స్టిట్యూషన్ లా తో పాటు ప్లీడిరగ్, డ్రాఫ్టింగ్, కోర్ట్ అబ్జర్వేషన్ అంశాలపై పలు సమస్యలు ఇచ్చారు.
పరీక్షలకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సీనియర్ అడ్వకేట్ నిజామాబాద్ రమా గౌడ్ వ్యవహరించారు. ఇంటర్నల్ ఎక్సమినర్‌గా డాక్టర్. బి. స్రవంతి వ్యవహరించాగా పూర్తి పరీక్షలకు ప్రిన్సిపల్, హెచ్. ఓ. డి. డాక్టర్ కె ప్రసన్నారాణి, చైర్ పర్సన్ బి.ఓ.ఎస్. డా.జెట్లింగ్ ఎల్లోసా సహకారంతో నిర్వహించారు. పరీక్షలలో కాంటాక్ట్ అధ్యాపకురాలు నాగజ్యోతి, న్యాయ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.