కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజిలెన్స్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు.
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం అందేలా చూడాలని కోరారు. లోపాలు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా అధికారులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.