బాన్సువాడ, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా కల్పించేందుకు సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలన్నారు.
అనంతరం డిపో నుండి ప్రధాన మెయిన్ రోడ్డుకు 10 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్ డిపోకు విచ్చేసిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి డిపో మేనేజర్ సరితా దేవి పుష్పగుచ్చం స్వాగతం పలికారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సరితా దేవి, నాయకులు శ్రీధర్, ఎజాస్, శివ దయాల్ వర్మ, నరసన్న చారి, కిరణ్, కౌన్సిలర్లు రమాదేవి రాజా గౌడ్, అమీర్ ఛావుస్, నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు బసంత్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు.