Daily Archives: August 22, 2023

సెప్టిక్‌ ట్యాంక్‌ లేకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవద్దు

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మ్యానువల్‌ స్కావెంజర్‌ ఫ్రీ జిల్లాగా కామారెడ్డి జిల్లాను ప్రకటించినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ మ్యానువల్‌ స్కావెంజర్‌ నిషేధ చట్టం పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. పట్టణాల్లో, గ్రామాల్లో గృహాల …

Read More »

25న ప్రజా ఆశీర్వాద ర్యాలీ

నందిపేట్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి స్వాగతం పలుకుతూ… జరిగే ప్రజా ఆశీర్వాద ర్యాలీకి భారీ ఎత్తున తరలి రావాలని, నందిపేట్‌ మండల బీఆర్‌ఎస్‌ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నందిపేట్‌ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన మూడోసారి ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నియమింపబడి, మొదటిసారిగా …

Read More »

ఉత్తమ ఉద్యోగ పురస్కార గ్రహీతకు సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన పుట్ల అనిల్‌ విజిలెన్స్‌ పోలీస్‌, విద్యుత్‌ చౌర్యం నిరోధక శాఖ ఎల్లారెడ్డి డివిజన్లో విధులు నిర్వహించడంతో పాటుగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడుగా ఉంటూ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగ పురస్కారానికి ఎంపికైనందుకుగాను మంగళవారం కామారెడ్డి రక్తదాతల …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌ హేమలత జిల్లా పరిషద్‌ పెర్కిట్‌ పాఠశాలలో, బాలుర పాఠశాల ఆర్మూర్‌లో క్రీడాకారులకు వాలీబాల్స్‌, టెన్నికైట్స్‌ వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలలో లయన్స్‌ సేవలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మన లయన్స్‌ …

Read More »

వృద్దుల ఓటింగ్‌ శాతం పెరగడానికి సౌకర్యాలు కల్పించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో …

Read More »

ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యం…

బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీభవన్‌లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యమని …

Read More »

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్దులకు పోలింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 10.11 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 4.36 వరకుయోగం : శుక్లం రాత్రి 8.16 వరకుకరణం : కౌలువ ఉదయం 9.58 వరకు తదుపరి తైతుల రాత్రి 10.11 వరకు వర్జ్యం : ఉదయం 9.27 – 11.07దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »