కామారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీకి చెందిన పుట్ల అనిల్ విజిలెన్స్ పోలీస్, విద్యుత్ చౌర్యం నిరోధక శాఖ ఎల్లారెడ్డి డివిజన్లో విధులు నిర్వహించడంతో పాటుగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడుగా ఉంటూ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగ పురస్కారానికి ఎంపికైనందుకుగాను మంగళవారం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన పుట్ల అనిల్ కుమార్ సేవలు అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు జమీల్, సలహాదారులు రమణ, వాజిద్, ఎడ్ల రాజు పాల్గొన్నారు.