నందిపేట్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ… జరిగే ప్రజా ఆశీర్వాద ర్యాలీకి భారీ ఎత్తున తరలి రావాలని, నందిపేట్ మండల బీఆర్ఎస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందిపేట్ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
ఈనెల 25వ తేదీన మూడోసారి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నియమింపబడి, మొదటిసారిగా ఆర్మూర్‌కు వస్తున్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలన్నారు. నందిపేట్ మండలం నుంచి 500 కార్లు, వెయ్యి మోటార్ సైకిల్లతో ప్రజా ఆశీర్వాద ర్యాలీ విజయవంతం చేయాలన్నారు. మండలంలోని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, లిఫ్ట్ చైర్మన్లు, రైతుబంధు సమితి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉదయం 9 గంటలకు పెరికిట్ చౌరస్తాకు చేరుకోవాలని తెలిపారు.