హైదరాబాద్, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్ తనకు గల్ఫ్ కోటాలో ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు, 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులు కలిసి తెలంగాణలో ఒక కోటి మంది ఓటు బ్యాంకు ఉన్నదని అన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రతినిధిగా ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఒక గల్ఫ్ బిడ్డగా తనకు ఉన్నదని, ప్రత్యర్థులకు ధీటుగా ఖర్చు చేస్తానని నరేష్ రెడ్డి అన్నారు.