కామారెడ్డి, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్ ను రూ.4016 ప్రభుత్వం పెంచిందని చెప్పారు. గతంలో కంటే వెయ్యి రూపాయలు పెంచిందని పేర్కొన్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు కొత్తగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, అడిషనల్ డి ఆర్డిఓ మురళీకృష్ణ, డిపిఎంలు, దివ్యాంగులు, టేకేదారులు పాల్గొన్నారు.