కామారెడ్డి, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
వ్యవసాయంతో పాటు అనుబంధంగా చేపల పెంపకం చేపట్టి మహిళలు లక్షాధికారులు కావాలని తెలిపారు. ఇతర మహిళలకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ మెలకువలు నేర్చుకొని ఆర్థికంగా పటిష్టం కావాలని సూచించారు. మహిళల సందేహాలకు అధికారులు సమాధానాలు తెలిపారు. సమావేశంలో డిఆర్డిఓ సాయన్న, అడిషనల్ డిఆర్డిఓ మురళీకృష్ణ, డిపిఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.