యువతకు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్ట్‌ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పోటీలు ఆగస్టు 28, 29వ తేదీలలో ఉదయం 10గంటలకు కలెక్టర్‌ గ్రౌండ్‌లో జరుగుతాయని, పోటీల అనంతరం విజేతలకు 29వ తేదీన బహుమతుల ప్రధానం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారుల వయసు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్‌, జావలిన్‌ త్రో, హాకీ, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షార్ట్‌ ఫుట్‌ క్రీడలలో పోటీలు జరుగుతాయన్నారు.

ఆసక్తి గలా జట్లు, క్రీడాకారులు ముందుగా తమ పేర్లను వాట్సాప్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, వాట్సాప్‌ నెం.9100435410 తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులందరికీ ఆహ్వానం, పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »