బాన్సువాడ, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు బాన్సువాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు.
శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడను జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం రెవిన్యూ డివిజన్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా 20 మండలాలతో ఉన్న బాన్సువాడను జిల్లాగా ఏర్పాటు చేయడంలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారని, కేవలం రాజకీయ ప్రజల కోసమే బాన్సువాడ జిల్లా ఏర్పాటు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గం ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం కామారెడ్డి దూరమవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు ప్రజలు చాలా సమస్య ఎదుర్కొంటున్నారన్నారు. దూర భారం తగ్గడం కొరకు ప్రజల సౌకర్యార్థం కొరకు ప్రభుత్వం స్పందించి బాన్సువాడ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సాధన కొరకు సిపిఐ పార్టీ శ్రేణులు కార్మిక వర్గం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, భూమయ్య, సురేష్ బాబు, సురేష్, అశోక్, రాజు, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.