బాన్సువాడ, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బిపి మండల్ 105 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్ మండల్ (1918-1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త, అతను రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్ (మండల్ కమీషన్‌గా సుపరిచితం) కు చైర్మన్‌గా వ్యవహరించాడు.
అతను ఉత్తర బీహార్‌లోని సహర్సాలో అత్యంత ధనికులైన యాదవ్ జమీందారీ (భూస్వాములు) కుటుంబంలో జన్మించారు. కమీషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని అదర్ బేక్ వర్డ్ క్లాసెస్ (ఓబిసి) (ఇతర వెనుకబడిన కులాలు) గా నివేదిక ప్రకారం నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న, బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది, బీసీల హక్కుల కోసమై తన జీవితాన్ని ధారపోశాడు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు నిఖిల్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు రాఘవేంద్ర, మండల నాయకులు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.