పోలింగ్‌ బూత్‌ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బీ.ఎల్‌.ఓలతో పాటు ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు.

వాటిని పూరించి బీ.ఎల్‌.ఓలకు అందజేయవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఇటీవల విడుదల చేసిన ఓటరు డ్రాఫ్ట్‌ రోల్‌కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »