జర్నలిస్టు రాజేందర్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

ఆర్మూర్‌, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలో పలు దిన పత్రికలలో సీనియర్‌ జర్నలిస్టుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన వేల్పుర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామనికి చెందిన జల్లెల రాజేందర్‌ కుటుంబానికి నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన చెక్కును పంపిణీ చేశారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా అందజేసిన లక్ష రూపాయల చెక్కును వారి సతీమణికి శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మరణించిన కుటుంబానికి అండగా నిలిచిన ప్రెస్‌ ఆకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులు అందరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రిలో అమలయ్యేలా చూడాలని కోరారు.

కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుంకరి గంగమోహన్‌, మాజీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్‌, ప్రధాన కార్యదర్శి యమ్మాజీ చరణ్‌ గౌడ్‌, టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్‌ పార్దేమ్‌, కోశాధికారి లిక్కి శ్రవణ్‌, సలహాదరులు గణేష్‌ గౌడ్‌, ఆర్గుల్‌ అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »