కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ, గంజిలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని వివిధ పోలింగు బూతులను సందర్శించారు. 203 నుంచి 208 వరకు, 220,221 పోలింగ్ బూతులతో ఉన్న బి.ఎల్.ఓ. లతో ఉన్న ఓటరు ముసాయిదా ప్రతులను, ఓటరు నమోదు పత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఓటరు నమోదుతో పాటు మార్పులు,చేర్పులు, ఆక్షేపణలు, అభ్యంతరాలు స్వీకరించుటకు నేడు, రేపు తిరిగి సెప్టెంబర్ 2,3 తేదీలలో చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్ కు అవసరమైన ఫారం-6,7,8 అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని 791 పోలింగ్ బూతులతో బ్లాక్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బి.ఎల్.ఓ.ల వద్ద ఉన్న ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది పరిశీలించుకొవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అక్టోబర్ 1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొవాలన్నారు. బి.ఎల్.ఓ.ల వద్ద ఓటరు నమోదుకు ఫారం-6, ఫారం 8 ద్వారా పేరు,చిరునామాలో సవరణ, ఫోటో, పోలింగ్ కేంద్రాల మార్పు కు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు.
సెప్టెంబర్ 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. అక్టోబర్ 4 న ఓటర్ల జాబితా వెలువడుతుందని, ఆ జాబితా ప్రకారమే రాబోయే సాధారణ ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. యువత, ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం ఈ నెల 27 న, తిరిగి సెప్టెంబర్ 2,3 తేదీలలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడంలో సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహశీల్ధార్ లతా, ఎలెక్షన్ డిప్యూటీ తహశీల్ధార్ సాయిలు ఉన్నారు.