వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

బాన్సువాడ, ఆగష్టు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు మట్టితో పార్దివ శివలింగాలు తయారు చేశారు.

ఈ సందర్భంగా దెగ్లుర్‌ హన్మండ్లు మాట్లాడుతూ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వెంకటేశ్వర ఆలయానికి బిచ్కుంద మఠాధిపతి సోమాయప్ప ఆలయానికి విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా ఆలయంలో పార్తివ శివలింగాలతో శివునికి బిల్వార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద హన్మండ్లు, పందిరి భాస్కర్‌, వెంకటేష్‌, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »