Daily Archives: August 28, 2023

నోటరీ భూముల క్రమబద్ధీకరణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు …

Read More »

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మినీ అంగ్వాడీలను మెయిన్‌ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్‌ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి నిజాంసాగర్‌ చౌరస్తాలో టపాకాయలు కాల్చి, కేక్‌ కట్‌ చేసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థాపకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు అడెపు వరలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు రేణుక, జనరల్‌ …

Read More »

కామారెడ్డిలో హరితహారం భేష్‌… పలు సూచనలు…

కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిక్కటి గ్రీనరీ తో జిల్లా పచ్చదనం సంతరించుకునేలా విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం హరితహారం ఓ.ఎస్‌.డి. ప్రియాంక వర్గీస్‌ అధికారులకు సూచించారు. వాతావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆ దిశగా జిల్లా అంతా పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడా గ్యాప్‌ లేకుండా మొక్కలు నాటాలని అన్నారు. సోమవారం …

Read More »

తల్లి దండ్రుల సమక్షంలో కులాంతర వివాహం

ఆర్మూర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం హరిపూర్‌ పల్లె గ్రామంలోని రామ్‌ మందిరంలో సోమవారం జరిగిన కళ్యాణంలో వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన ఈ కులాంతర వివాహనికి ముఖ్య అతిధిగా బీఎస్పీ ఆర్మూర్‌ నియోజక వర్గ ఇంచార్జీ కోమిరే సుధాకర్‌ హాజరై నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కుల నిర్మూలన జరిగే విధంగా ఈ వివాహాన్ని జరుపుకున్న సంతోష్‌ …

Read More »

స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం …

Read More »

జిల్లా అధికారులే… పెళ్ళి పెద్దలుగా…

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సదాశివనగర్‌ మండలంలోని ధర్మారావుపేట రెడ్డి సంఘ భవనంలో జరిగిన రూప, అనిల్‌ల వివాహానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్రమోహన్‌, జిల్లా అధికారులు హాజరై అక్షింతలు వేసి నిండు నూరేళ్లు అన్యోనంగా, ఆదర్శ దంపతులుగా జీవించాలని ఆశీర్వదించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రూపను ఐ.సి.డి.ఎస్‌. …

Read More »

ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

ప్రజావాణికి 132 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, నగర పాలక సంస్థ …

Read More »

ప్రజావాణిలో 93 వినతులు

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 93 వినతులు జెడ్పి సీఈఓ సాయ గౌడ్‌ తో కలిసి స్వీకరించారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు,ధరణి, భూ తగాదాలకు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఆగష్టు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి మధ్యాహ్నం 3.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.21 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 9.03 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.28 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.10 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.50, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »