ఆర్మూర్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం హరిపూర్ పల్లె గ్రామంలోని రామ్ మందిరంలో సోమవారం జరిగిన కళ్యాణంలో వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన ఈ కులాంతర వివాహనికి ముఖ్య అతిధిగా బీఎస్పీ ఆర్మూర్ నియోజక వర్గ ఇంచార్జీ కోమిరే సుధాకర్ హాజరై నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
రానున్న రోజుల్లో కుల నిర్మూలన జరిగే విధంగా ఈ వివాహాన్ని జరుపుకున్న సంతోష్ కుమార్, శ్రీలత నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహానికి ఇరువురి కుటుంబసభ్యులు ఒప్పుకోవడం గర్వించద్దగ్గ విషయమన్నారు. కార్యక్రమానికి బిఎస్పి ఆర్మూర్ నియోజక వర్గ అధ్యక్షుడు గండికోట రాజన్న, ఆర్మూర్ టౌన్ అధ్యక్షుడు బక్కొల్ల రవి, బిఎస్పి నందిపెట్ మండల నాయకులు బొంబాయి లింగం, కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు పాల్గొన్నారు.