కామారెడ్డి, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినీ అంగ్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి నిజాంసాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థాపకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు అడెపు వరలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు రేణుక, జనరల్ సెక్రెటరీ లక్ష్మీ బాయి మాట్లాడారు.
తమ మినీ అంగన్వాడిల సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ శ్రమను గుర్తించి తమకు వేతనం పెంచడం జరిగిందని అన్నారు. మినీ అంగన్వాడీ కుటుంబాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. మినీ అంగన్వాడీల గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్యమాలు చేయకుండానే తమ సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఉంటామని తెలిపారు. తమ సమస్యల పరిష్కారాణికి ప్రత్యేక కృషి జరిపిన కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్ మినీ ప్రాజెక్ట్ అంగన్వాడీలు మంజుల, అనురాధ శోభ, సుష్మ, ఉమా, పార్వతి లత, మీని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.