ఆర్మూర్, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూరు ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి.రాణి జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ మాంత్రికుడు ధ్యానచంద్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన రాణిని పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ జింఖాన మైదానంలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడా పోటీలలో హాకి విభాగంలో రాణి పాల్గొని అద్భుత క్రీడా పటిమను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
నవంబర్‌లో ఒరిస్సాలో జరుగనున్న జాతీయ స్థాయి హాకి పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున రాణి పాల్గొననున్నారు. జాతీయ పోటీలలో విజయం సాధించాలని ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.