ఈ.డబ్ల్యు.ఎఫ్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ.డబ్ల్యు.ఎఫ్‌ రుణం కావాల్సిన నాన్‌ గెజిటెడ్‌, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ దరఖాస్తులను డ్రాయింగ్‌ ఆఫీసర్ల ద్వారా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించాలని జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉప సంచాలకులు బి.కోటేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.

సంబంధిత ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. రుణాలు పొందగోరే జిల్లాలోని నాన్‌ గెజిటెడ్‌, నాల్గవ తరగతి ఉద్యోగులు సెప్టెంబర్‌ 20వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »