నిజామాబాద్, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ బుధవారం పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి వారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని రెగ్యులర్ చెయ్యాలని, ఎగ్జామ్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని కోరారు. వారు కరోనా సమయం నుండి నిరంతరం రోగుల సమస్యల పరిష్కారానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డారని అప్పుడు ప్రభుత్వం వారిని వాడుకొని ఇప్పుడు వారి సమస్యలు పరిష్కరించాలని అడిగితే కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు.
వెంటనే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంకార్ గణేష్, చంద్రకాంత్, శ్రీనివాస్, ప్రమీల, శ్రీవాని తదితరులు పాల్గొన్నారు.