అభ్యంతరలుంటే తెలపండి…

కామారెడ్డి, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మొహ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటుకు అభ్యంతరాలు, సూచనలు అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ రెవెన్యు డివిజన్‌లోని నిజాంసాగర్‌ మండలం నుండి 18 గ్రామాలతో మొహమ్మద్‌ నగర్‌ నూతన మండలం ఏర్పాటుకు ఈ నెల 28 న ప్రాథమిక గజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశామని తెలిపారు.

మొహ్మద్‌ నగర్‌, తెల్గా పూర్‌, శనివార్‌ పెట్‌, సింగీతం, వెంగలంపల్లి, మగ్దూం పుర్‌, గాలీపూర్‌, కొమలాంచ, తుంకిపల్లి , తుర్కపల్లి, షేర్‌ ఖాన్‌ పల్లి, నర్వ, బూర్గుల్‌, హాసన్‌ పల్లి, నర్సాపూర్‌, రాఘవపల్లి, కోసంపల్లి , రంగాపూర్‌ గ్రామాలతో నూతనంగా మహ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీచేశామన్నారు.

నూతన మండలం ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు చేయదలచిన వారు ఈ నెల 28 న ముసాయిదా ప్రకటన వెలువడిన నాటి నుండి పక్షం రోజులల్లోగా తెలుగు / ఇంగ్లిష్‌ / ఉర్దూ భాషలో లిఖిత పూర్వకంగా తెలుపవలసినదిగా కలెక్టర్‌ కోరారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »