నిజామాబాద్, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా విద్యార్ధి పరిషత్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు అఖిల్ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు రాఖీ కట్టించుకొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల రక్షణకోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కంకణ బద్దులై ఉంటారని వారి రక్షణ కోసం నిరంతరం పాటుపడుతామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో మహిళలకోసం ఎన్ని చట్టాలు రూపొందించిన దాడులు ఆగడం లేదని, మహిళలపై దాడులు అగాలంటే సమాజంలో సోదరభావం పెంపొందించాలని, మనుషుల్లో మానసిక పరివర్తన వల్లే మార్పు సాధ్యమని దానికి వేదికే ఈ రక్ష బంధన్ కార్యక్రమమన్నారు.
కళాశాలలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికి ఒకరు రక్షణగా సోదర భావంతో వుండాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలకు ఈవ్టీజింగ్, సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ లాంటివి ఇబ్బంది పెడితే టిజివిపికి తెలియజేస్తే షి టీమ్ వారి సహకారంతో మీకు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం మిఠాయి పంచారు. కార్యక్రమంలో మహేష్, సోహేల్ సుజిత్, ఇమ్రాన్, అయాన్, అదీబ్ తదితరులు పాల్గొన్నారు.